నటి రకుల్ ప్రీత్ సింగ్ 2022 సంవత్సరానికి ఏడు భారీ సినిమాలను విడుదల చేసేందుకు సిద్ధాంగా ఉంది. వాటిలో ఒక తెనుగు మూవీతో పాటు ఆరు హిందీ సినిమాలు ఉండడం విశేషం. బాలీవుడ్‌లో డాక్టర్ జి, అమితాబ్ బచ్చన్ & అజయ్ దేవగన్‌లతో 'రన్‌వే 34' - అజయ్ దేవగన్ & సిద్ధార్థ్ మల్హోత్రాతో 'థ్యాంక్ గాడ్' - 'చత్రీవాలి', 'ఎటాక్' మరియు అక్షయ్ కుమార్‌తో మరో సినిమా చేయనుంది.
ఇక తన తదుపరి సినిమాల గురించి రకుల్ ఇటీవల ఒక క్లారిటీ కూడా ఇచ్చింది. “2022 నా అత్యుత్తమ సంవత్సరాల్లో ఒకటిగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను అంటూ.. ఎందుకంటే 7 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని.. వీలైనంత త్వరగా ఆ సినిమా పనులన్నిటిని ఫినిష్ చేస్తానని వివరణ ఇచ్చింది. ఇక తెలుగులో ఈ బ్యూటీకి సరైన అవకాశాలు రావడం లేదు. చివరగా చేసిన చెక్ సినిమా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.
Follow @TBO_Updates
Post a Comment