హీరో కార్తికేయ గుమ్మకొండ దర్శకుడు అజయ్ భూపతితో మరోసారి కలవబోతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ ఇంతకు ముందు RX 100తో బాక్సాఫీస్ హిట్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత దర్శకుడు అజయ్ మహాసముద్రం సినిమాతో డిజాస్టర్ అందుకున్నాడు.
ఇక కార్తికేయ కూడా ఇటీవల కాలంలో సరైన సక్సెస్ చూడలేదు. ఇక ఇన్నాళ్లకు వీరు మరో సినిమా కోసం కలవబోతున్నట్లు సమాచారం. అది కూడా భారీ బడ్జెట్‌తో తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంగా సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. స్క్రిప్ట్ చాలా చక్కగా రూపుదిద్దుకున్నట్లు చెబుతున్నారు. మహాసముద్రం సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని ధీమాగా ఉన్న అజయ్ ఊహించని విధంగా ప్లాప్ ఎదుర్కొన్నాడు. మరి మూడవసారి కార్తికేయతో ఎలాంటి సక్సెస్ ను అందుకుంటాడో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment