RRR షోలు.. ఒక రోజు ముందే?


భారీ అంచనాలతో జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న RRR సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను బ్రేక్ చేస్తుందని చెప్పవచ్చు. అయితే సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలపై ప్రస్తుతం ఇండస్ట్రీలో అనేక రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. దర్శకుడు రాజమౌళి కూడా ఇటీవల నిర్మాతలతో చర్చలు జరిపినట్లు సమాచారం.

సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు అంటే ఒక రోజు ముందుగానే ప్రీమియర్ షోలు అంటూ హడావిడి మొదలవుతుంది. ఇక ఈ సినిమా విషయంలో కూడా జనవరి 6వ తేదీన సాయంత్రం ఆరు గంటల నుంచే ప్రదర్శనలు మొదలు కాబోతున్నట్లు సమాచారం. డిస్ట్రిబ్యూటర్ లతో మరో సారీ చర్చలు జరిపి సినిమా టికెట్లు రెట్లపై కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. మరి ఆ రూట్లో సినిమా ఎంతవరకు బిజినెస్ చేస్తుందో చూడాలి.


Post a Comment

Previous Post Next Post