RRR ఈవెంట్: అతని కోసం రాబోతున్న సల్మాన్!


బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ RRR ప్రమోషన్ లో కూడా కీలకం కానున్నట్లు తెలుస్తోంది. బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ RRR వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద బిగ్ హిట్ అందుకోవాలని చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్స్ చేస్తున్నారు. 

ఇక బాలీవుడ్ ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసేందుకు నిర్వహించబోయే ప్రీ రిలీజ్ ఇవేంట్ కి సల్మాన్ ఖాన్ ప్రత్యేక అతిథిగా వచ్చే అవకాశం జన్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ ప్రత్యేకంగా కోరడం వల్లనే సల్మాన్ వేడుకకు రాబోతున్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా సల్మాన్ కు మెగా ఫ్యామిలీకి అలాగే ఉపాసన కామినేని కుటుంబానికి మంచి సాన్నిహిత్యం ఉంది. ఇక చరణ్ కోరితే భాయ్ రాకుండా ఉంటాడా.. ఇక ఆ వేడుకకు కరణ్ జోహార్ హోస్ట్ గా కనిపించబోతున్నాడు

Post a Comment

Previous Post Next Post