RRRలో టైగర్ గా కనిపించింది ఎవరంటే?


త్రిబుల్ ఆర్ సినిమా పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  చిత్రం యూనిట్ సభ్యులు అన్ని భాషల్లో ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ప్రతి భాషలో కూడా మీడియా ముందుకు వెళుతున్న రాజమౌళి టీమ్ వారు అడుగుతున్న ప్రశ్నలకు కూడా సమాధానం ఇస్తున్నారు. అయితే నేడు RRR టీమ్ తెలుగు మీడియా ముందుకు వచ్చారు.

ఇక సినిమాలో టైగర్ ను చూసి ఏ విధంగా ఫీలయ్యారు బయపడ్డారా లేదా అనే ప్రశ్నకు తమదైన శైలిలో సమాధానం చెప్పాడు. నా ముందు టైగర్ లా గర్జించింది మరెవరో కాదు రాజమౌళి గారే అని చెప్పారు. ఎలాగూ తెలిసిన టైగర్ కాబట్టి పెద్దగా భయపడలేదు అంటూ తారక్ వివరణ ఇచ్చారు. ఇక గ్రాఫిక్స్ చేసే కంటే ముందు రాజమౌళి కొమురం భీమ్ క్యారెక్టర్ ముందు పులి లాగా గర్జించినట్లు అర్ధమవుతోంది.


Post a Comment

Previous Post Next Post