శంకర్‌తో రామ్ చరణ్ తన 15వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే, ఈ సినిమా కూడా గత నెల రోజులుగా ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్ RRR ప్రమోషన్ లో బిజీగా ఉండడం వలన కాస్త బ్రేక్ ఇచ్చాడు. ఇక శంకర్ వేరే సీన్స్ పూర్తి చేయడంలో బిజీగా ఉన్నాడు. ఇక సినిమాలో కమర్షియల్ అంశాలతో పాటు జనాలను ఆలోచింప జేసీ ఎన్నో హార్ట్ టచింగ్ మెస్సేజ్ లు కూడా ఉంటాయట.
ముఖ్యంగా సినిమాలో ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ హైలైట్ గా ఉండబోతోందని సమాచారం. ఆ సీన్స్ ను త్వరలోనే షూట్ చేస్తారట. రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన హార్ట్ టచింగ్ సీన్స్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతాయట. దర్శకుడు శంకర్ ఈ సినిమాలో రామ్ చరణ్ ను మూడు విభిన్నమైన షేడ్స్ లో ప్రజెంట్ చేస్తాడని తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో ఒకలా ఉండే చరణ్ ఆ తరువాత ప్రజెంట్ లో ఐపీఎస్ ఆఫీసర్ గా ఉంటాడట. ఇక సెకండ్ హాఫ్ అనంతరం క్లైమాక్స్ లో మరొక షేడ్ లో కనిపిస్తాడని తెలుస్తోంది.
Follow @TBO_Updates
Post a Comment