ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప క్లైమాక్స్ సీక్వెన్స్ సినిమాకు పెద్ద మైనెస్. ఫహద్ ఫాసిల్ పోర్షన్స్ ని అనవసరంగా దాదాపు 30 నిమిషాల పాటు లాగడం వల్ల ప్రేక్షకులకు బోర్ కొట్టిందనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఇది సినిమా నిడివిని కూడా పెంచింది. క్లైమాక్స్‌లో అల్లు అర్జున్ మరియు ఫహద్ ఫాసిల్ ఇద్దరు కూడా అండర్ వేర్ తో కనిపించే సీక్వెన్స్ ఉంది. అయితే చాలా మంది సీక్వెన్స్ నార్మల్ గానే ఉందని అభిప్రాయపడ్డారు.
అయితే సుకుమార్ దాన్ని మరింత పచ్చిగా ఊహించుకున్నాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఇంటర్వ్యూలో వెల్లడించారు. “ఆ సన్నివేశంలో ఇద్దరూ పూర్తిగా నగ్నంగా ఉండాలని నేను కోరుకున్నాను. మేము వారిని తెరపై అర్ధ నగ్నంగా చూపించము కాని వారు నగ్నంగా ఉన్నారనే ఫీలింగ్ కలిగిస్తాము. కానీ, తెలుగు ప్రేక్షకులకు ఇది మింగుడు పడదని భావించి చివరి నిమిషంలో ఆ ఆలోచనను విరమించుకున్నాను’’ అని సుకుమార్ వెల్లడించారు.
Follow @TBO_Updates
Post a Comment