హైంధవ ధర్మాన్ని ప్రచారం చేసి చరిత్రను నెలకొల్పిన మహోన్నతమైన వ్యక్తి జీవితాన్ని తెరపై చూపించాలనని బాలకృష్ణ చాలా కాలంగా అనుకుంటున్నాడు. ఇక సరైన స్క్రిప్ట్ సిద్ధమైతే త్వరలోనే బాలకృష్ణ తన డ్రీమ్ ప్రాజెక్టును వెండితెరపైకి తీసుకు రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. దానికి సంబంధించిన కథ సిద్ధమవుతోందని ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ కూడా తెలియజేశారు.
ఇదివరకే సి.కళ్యాణ్ బాలకృష్ణతో కొన్ని సినిమాలను నిర్మించారు. ఇక ఎప్పుడు మరొక సినిమాని నిర్మించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రాజెక్ట్ కూడా వెంటనే స్టార్ట్ అవుతుందని అన్నారు. ఇక అఖండ సినిమాలో బాలకృష్ణ అఘోరా పాత్రలో కనిపించి దేవాలయాలకు సంబంధించిన గొప్పతనం గురించి అద్భుతంగా వివరించి మంచి క్రేజ్ అందుకున్నారు. ఇక భవిష్యత్తులో శంకరాచార్య సినిమాతో ఎంతవరకు ఆకట్టుకుంటారో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment