మహేష్, త్రివిక్రమ్ సినిమాలో బాలీవుడ్ హీరో పవర్ఫుల్ రోల్?


మహేష్ బాబు రానున్న రోజుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ భారీ చిత్రాన్ని లైన్లో పెట్టనున్న సంగతి తెలిసిందే.  ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా ఫిక్స్ అయ్యింది. ఇక హిందీ నటుడు, సంజయ్ దత్‌ని ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించడానికి ఎంపిక చేసినట్లు గత కొంతకాలంగా ఒక న్యూస్ అయితే వైరల్ అవుతోంది.

అయితే ఈ సినిమాలో సంజయ్ దత్ అవినీతిపరుడైన రాజకీయ నాయకుడిగా కనిపిస్తాడనేది ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో మరో కొత్త టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ సినిమా అంటేనే సినిమాలో విలన్ క్యారెక్టర్ కూడా చాలా తెలివిగా ఉంటుంది. ఇక ఈ సినిమా ఫైనల్ స్క్రిప్ట్ ఇదివరకే పూర్తి చేసిన త్రివిక్రమ్ త్వరలోనే మరొక అఫీషియల్ ఎనౌన్స్మెంట్ తో ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసే అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.


Post a Comment

Previous Post Next Post