సినీ నటి సమంత అస్వస్థతకు గురైనట్లు ఉదయం నుంచి సోషల్ మీడియాలో అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. అయితే రీసెంట్ సమంత వరుసగా శ్రీకాళహస్తి , తిరుపతి , కడప సహా పలు ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. దీంతో ఆమె స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఇక కొన్ని వెబ్ మీడియాలలో సమంత ఆరోగ్యంపై అబద్ధపు ప్రచారాలు జరగడంతో ఆమె మేనేజర్ క్లారిటీ ఇచ్చారు.
సమంత ఆరోగ్యంగా ఉన్నారుని నిన్న కాస్తంత దగ్గు రావడంతో ఏఐజీ ఆస్పత్రిలో పరీక్ష చేయించుకున్న ఆమె ఇంట్లో విశ్రాంతి తీసుకుంటోంది. ఎలాంటి వదంతులు నమ్మవద్దు అని సమంత మేనేజర్ తెలిపారు. కాస్త జ్వరం , జలుబుతో బాధపడుతోందని దీంతో ముందు జాగ్రత్తగా ఆస్పత్రిలో టెస్టులు చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల సమంత తమిళ్ లో ఒక సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు. అలాగే పుష్పలో ఐటెమ్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే.
Follow @TBO_Updates
Post a Comment