రాధేశ్యామ్ ఈవెంట్ లో హైలెట్ అయిన ఒకే ఒక్క అంశం నవీన్ పొలిశెట్టి హోస్టింగ్. డార్లింగ్ ప్రభాస్ కూడా ఈ ఈవెంట్ లో ఎక్కువగా అయితే మాట్లాడలేదు. మొత్తంగా నవీన్ అందరిని డామినేట్ చేసి తన సినిమా అన్నట్లుగా హోస్టింగ్ చేశాడు. అయితే అందుకు నవీన్ రెమ్యునరేషన్ ఏమైనా తీసుకున్నాడా అనే అపోహలు రాకుండా ఉండవు. నిజానికి నవీన్ ఎలాంటి పేమెంట్ తీసుకోలేదని తెలుస్తోంది.
జాతిరత్నాలు ప్రమోషన్ లోనే నవీన్ టాలెంట్ గురించి అందరికి అర్ధమయ్యింది. జనాల్లో కలిసిపోతూ చాలా చాలా బాగా సినిమాను ప్రమోట్ చేశాడు. అయితే ప్రభాస్ కు ఈ ఐడియా ఇచ్చింది ప్రాజెక్ K దర్శకుడు నాగ్ అశ్విన్ అని తెలుస్తోంది. ఈ జాతిరత్నాలు ప్రొడ్యూసర్ అంటే నవీన్ కి చాలా ఇష్టం. ఇక ప్రభాస్ కూడా ఆ సినిమా ప్రమోషన్ అప్పుడు ట్రైలర్ లాంచ్ చేసి బాగానే సపోర్ట్ చేశాడు. ఆ కృతజ్ఞత కూడా ఉండడంతో నవీన్ పెద్దగా చర్చలు లేకుండా అడగ్గానే ఈవెంట్ కు హోస్ట్ చేయడానికి ఒప్పుకున్నాడట. పేమెంట్ గురించి మాట్లాడొద్దు అని ప్రభాస్ అన్న కోసమే మనం సెలబ్రేట్ చేద్దామని రంగంలోకి దుకాడట. నవీన్ మంచితనాన్ని చూసిన యూవీ క్రియేషన్స్ ఎదైన మూవీ ఆఫర్ చేయచ్చు అని తెలుస్తోంది.
Follow @TBO_Updates
Post a Comment