క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ పుష్ప సినిమాతో మొత్తానికి భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అయితే అందుకున్నాడు. కానీ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ ఎన్ని రోజులు కొనసాగుతుంది అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ సినిమా కథ అనుకున్న స్థాయిలో ఏమి లేదు అని చాలామంది అభిమానులు నుంచి అభిప్రాయాలు అయితే వెలువడుతున్నాయి. ఇక సుకుమార్ మొదట మహేష్ బాబు తో ఒక సినిమా చేయాలని అనుకున్న విషయం తెలిసిందే.
రంగస్థలం సినిమా తర్వాత మహేష్ బాబుతో కొన్ని రోజుల వరకు చర్చలు జరిపి సుకుమార్ పుష్ప కథ చెప్పి ఉంటాడు అని అందరూ అనుకున్నారు. ఇక ఇటీవల సుకుమార్ మళ్లీ అదే విషయంపై క్లారిటీ ఇచ్చారు. మహేష్‌తో ఓ సినిమా చేయాలనుకున్నది నిజమే అంటూ కాకపోతే ఆక స్టోరీకి పుష్పకీ చాలా తేడా ఉందని అన్నాడు. అంతే కాకుండా ఆ కథ ఈ కథ వేరు అని చెప్పలేను. అలాగని ఒకటే అని కూడా క్లారిటీ ఇవ్వలేనని చెప్పాడు. ఎందుకంటే అది కాస్త డిఫరెంట్ గా ఉంటుందని సుకుమార్ చెప్పాడు. బహుశా మహేష్ బాబుతో మరొక కోణంలో ఈ సినిమాను డిజైన్ చేసుకొని ఉండవచ్చని తెలుస్తోంది. కానీ బన్నీతో చేసిన కథను మహేష్ తో చేస్తే మాత్రం అస్సలు సెట్ అయ్యేది కాదని అందరికి అర్థమై ఉంటుంది.
Follow @TBO_Updates
Post a Comment