పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేవలం స్టార్ హీరో నే కాకుండా రచయితగానూ దర్శకుడిగానూ మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ సంగీత ప్రియుడు అని కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన సినిమాలో ఏదో ఒక మంచి సందేశంతో ఒక పాట ఉండేలా చూసుకుంటాడు. సరదాగా కుర్రాళ్లనుఅక్కటుకునే విధంగా పాటలను కూడా పాడుతూ ఉంటాడు.
గతంలో అత్తారింటికి దారేది అజ్ఞాతవాసి వంటి సినిమాల్లో పవన్ కళ్యాణ్ తన గాత్రం తో అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమాలో కూడా ఒక చిన్న బిట్ సాంగ్ తో అలరించబోతున్నట్లు సమాచారం. సంగీత దర్శకుడు ఇప్పటికే థమన్ ఇప్పటికే అందుకు సంబంధించిన కంపోజింగ్ అంతా రెడీ చేసాడట. పవన్ కళ్యాణ్ పాడడం బ్యాలెన్స్ ఉందని తెలుస్తోంది. సినిమాలో వచ్చే ఆ చిన్న బిట్ సాంగ్ ప్రేక్షకులకు మరింత ఉత్తేజాన్ని ఇస్తుందట. మరి ఆ పాట ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment