నందమూరి బాలకృష్ణ తో దర్శకుడు బోయపాటి సింహా లెజెండ్ సినిమాల తర్వాత చేసిన అఖండ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా కోసం దర్శకుడు బోయపాటి రెమ్యునరేషన్ తీసుకోలేదట. ఎందుకంటే సినిమాకు సంబంధించిన బడ్జెట్ విషయంలో నిర్మాతకు దర్శకుడికి చాలా సందర్భాల్లో చర్చలో గట్టిగానే జరిగాయి. అందుకే దర్శకుడు బోయపాటి పారితోషకాన్ని త్యాగం చేశాడట.
ఇక సినిమా సక్సెస్ అయిన తర్వాత లాభాల్లో వాటా తీసుకునేలా డీల్ సెట్ చేసుకున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం సినిమా హడావుడి చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద మొదటివారంలోనే 50 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు అనిపిస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం బోయపాటికి 10కోట్లకు పైగానే లాభం వచ్చే వాతావరణం కనిపిస్తోంది. ఎలాగైనా సినిమాను గ్రాండ్గా తెరపైకి తీసుకురావాలని దర్శకుడు బోయపాటి చేసిన త్యాగానికి ఫలితం అయితే గట్టిగానే దక్కనుంది. మరి ఆ సినిమా మొత్తంగా ఏ స్థాయిలో లాభాలను అందిస్తుందో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment