ఉప్పెన బ్యూటీ ఫస్ట్ లేడి ఓరియెంటెడ్ మూవీ!


ఉప్పెన ఫేమ్ క్రితి శెట్టి స్లో అయ్యే మూడ్‌లో లేదు.  ఒకదాని తర్వాత మరొక ప్రాజెక్ట్‌ను చేజిక్కించుకుంటున తీరు అందరినీ షాక్‌కి గురిచేస్తోంది. క్రితి చేతిలో ఇప్పటికే కొన్ని పెద్ద సినిమాలు ఉన్నాయి.  ఇక ఇప్పుడు అమ్మడు ఆమె తన మొదటి లేడి ఓరియెంటెడ్ చిత్రానికి సంతకం చేసినట్లు వార్తలు వచ్చాయి.

ఉయ్యాల జంపాలా, మజ్ను వంటి చిత్రాలను రూపొందించిన దర్శకుడు విరించి వర్మ తన తదుపరి చిత్రాన్ని కృతిశెట్టితో చేయబోతున్నట్లు సమాచారం.
దీనికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ రణప్పటికి, ఈ వార్త అంతటా వైరల్‌గా మారింది.  మరి రానున్న రోజుల్లో కృతి శెట్టి ఇంకా ఎలాంటి ఆఫర్స్ అందుకుంటుందో చూడాలి. కృతి త్వరలోనే శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

Post a Comment

Previous Post Next Post