విడాకుల తరువాత మొదటిసారి.. పక్కపక్కనే చై - సామ్!


విడాకుల తరువాత, నాగ చైతన్య మరియు సమంత తమ కెరీర్ లో ఒక్కసారిగా స్పీడ్ పెంచారు.  అభిమానులకు ఇది బాధించే విషయమే అయినా వారి వ్యక్తిగత నిర్ణయాలతో ఇద్దరు కూడా సంతోషంగానే విడిపోయారు. చై, సామ్ ఇద్దరూ కూడా  కొత్త దశలను ప్రారంభిస్తున్నారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా సమంత తన స్థాయి పెరిగేలా ప్రాజెక్టులతో బిజీగా మారింది.

అయితే ఈరోజు రామానాయుడు స్టూడియోలో వీరిద్దరూ పక్కపక్కనే లోలేషన్స్ లో కనిపించారని తెలుస్తోంది. రామానాయుడు స్టూడియోలో చైతన్య బంగార్రాజు సినిమా తీస్తుండగా, సమంత అదే లొకేషన్‌లో యశోద షూటింగ్‌లో ఉంది.  ఇద్దరు కూడా వారి వ్యక్తిగత నిర్ణయాలకు కట్టుబడి ఎవరి పనులలో వారు బిజీగా ఉన్నట్లు సమాచారం. ఇక సిబ్బంది కూడా పరిస్థితులను అర్థం చేసుకొని ఒకరి కంట మరొకరు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post