నిన్న విడుదలైన పుష్ప చిత్రం విషయంలో ఒక నెగిటివ్ టాక్ బాగా వైరల్ అయ్యింది. అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్న మధ్య రొమాంటిక్ ట్రాక్ కాస్త ఎక్కువైనట్లు కామెంట్స్ వచ్చాయి.
ఒక వ్యాన్ లోపల కూర్చొని అల్లు అర్జున్ తన చేతిని రష్మిక భుజంపై ఉంచాడు. ఇక అరచేతి ఎక్కడ ఉందో అందరికి తెలిసిందే.
ఆ సన్నివేశం మాస్‌లో ఆడియెన్స్ లో బాగానే క్రేజ్ అందుకుంది. B & C సెంటర్‌లో చాలా పర్ఫెక్ట్‌గా పనిచేసింది. అయితే మేకర్స్ మాత్రం అందుకు సంతృప్తిగా లేరని తెలుస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ పెద్దగా రిసీవ్ చేసుకోక పోవడంతో థియేటర్లలో చూసిన అల్లు అర్జున్, సుకుమార్ లు కాస్త ఇబ్బంది పడ్డట్టు కనిపిస్తోంది. ఆ కారణంగా వారు ఇప్పుడు ఆ సన్నివేశాన్ని కత్తిరించారట. సెకండాఫ్‌కి అదనపు నిడివి ఉండడం వల్ల కాస్త అనవసరంగా అనిపించిందట. ఈ సీన్‌ని కత్తిరించడం వల్ల మరో 5 నిమిషాలు నిడివి తగ్గించవచ్చని ఆలోచించినట్లు సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment