టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేయాలని ఎవరికి ఉండదు. అయితే జక్కన్న లిస్టులో తాను కూడా ఉన్నట్లు అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చేశాడు. పుష్ప సినిమా కోసం వరుసగా ప్రమోషన్స్ చేసుకుంటూ వెళుతున్న అల్లు అర్జున్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రాజమౌళితో సినిమా చేయాలని లేదా అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
బన్నీ మాట్లాడుతూ.. ఆయనతో సినిమా చేయాలని అందరికి ఉంటుంది. ఒక సందర్భంలో మీతో సినిమా చేయాలని అనుకుంటున్నట్లు నేనే రాజమౌళి గారిని అడిగాను. ఇక ప్రస్తుతం రాజమౌళి గారి సినిమాలు చేయాలని అనుకుంటున్న హీరోలలో నేను కూడా ఉన్నట్లు ఆయనే స్వయంగా చెప్పినట్లు బన్నీ తెలియజేశాడు. అయితే సరైన ప్రాజెక్ట్ సెట్టయినప్పుడు తప్పకుండా సినిమా తెరపైకి వస్తుందని కూడా స్టైలిష్ స్టార్ వివరణ ఇచ్చారు.
Follow @TBO_Updates
Post a Comment