మహేష్ బాబుకు స్పెయిన్ లో సర్జరీ!


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు సర్జరీ జరిగింది. ఇటీవల స్పెయిన్ లో మహేష్ బాబు మోకాలికి చికిత్స జరగ్గా .. అనంతరం వెంటనే ఆయన దుబాయ్ లో విశ్రాంతి కోసం వెళ్లారు. కొన్ని రోజుల రెస్ట్ అనంతరం ప్రిన్స్ మళ్ళీ ఎప్పటిలానే సినిమాల షూటింగ్స్ తో బిజీ కానున్నాడు. ప్రస్తుతం మహేష్ సర్కారువారిపాట సినిమాలో మహేష్ నటిస్తున్న విషయం తెలిసిందే.

గాయం నుంచి కోలుకున్న అనంతరం మహేష్ ఫిబ్రవరి నుంచి షూటింగ్ పాల్గొనే అవకాశం ఉంది. ఇక సర్కారు వారి పాట 90% పనులు ముగిసినట్లు తెలుస్తోంది. సినిమాను ఎప్రిల్ 1 న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ సినిమా అనంతరం త్రివిక్రమ్ సినిమా కోసం సిద్ధం కానున్న మహేష్ ఆ వెంటనే రాజమౌళి ప్రాజెక్ట్ పనులను కూడా స్టార్ట్ చేయబోతున్నాడు.


Post a Comment

Previous Post Next Post