బాలీవుడ్ సినిమాలు అందుకే చేయట్లేదు: థమన్


అఖండ సినిమాతో మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు సంగీత దర్శకుడు తమన్. స్టార్ హీరోల ఇమేజ్ కు తగ్గట్టుగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించడంలో తనకు ఎవరూ సాటి రారు అంటూ మరోసారి అఖండ సినిమాతో నిరూపించాడు అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ వస్తున్నాయి అని చెప్పాడు. అయితే అక్కడ ఇదివరకే రెండు మూడు సినిమాలు చేసినట్లు చెబుతూ ప్రస్తుతం చేయాలని అందుకోవడం లేదని క్లారిటీ ఇచ్చేశాడు.


ఎందుకంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సినిమాకు నలుగురైదుగురు సంగీతదర్శకుల పని చేస్తూ ఉంటే అది నాకు ఏ మాత్రం నచ్చదు.. ఏదైనా సినిమా చేస్తే నేను ఒక్కడినే చేయాలి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా నేనే చేయాలి. అలా అయితేనే వర్క్ చేస్తాను అని చాలా క్లారిటీగా చెప్పాను. గతంలో గోల్ మాస్ ఫ్రాంచైజ్, సింబా సినిమాలకు కొన్ని పాటలు కంపోజ్ చేసి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అందించాను. అయితే పూర్తిస్థాయిలో ఒకే సినిమాకు పనిచేసే అవకాశం అక్కడ రావడం లేదు అందుకే పారిపోయి వచ్చేసాను అంటూ థమన్ వివరణ ఇచ్చాడు.

Post a Comment

Previous Post Next Post