టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన సోదరుడు రామాంజులు రెడ్డిని ఘోర రోడ్డు ప్రమాదంలో కోల్పోయారు. డిసెంబర్ 1 తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. కడపలోని చెన్నూరులో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రామాంజులు అక్కడికక్కడే మృతి చెందాడు.
రామాంజులు రెడ్డి సంబేపల్లె మండలం దుద్యాల గ్రామానికి చెందిన వ్యక్తి. ఆయన ఆకస్మిక మరణం కిరణ్ అబ్బవరంతో పాటు ఆయన కుటుంబ సభ్యులను దిగ్భ్రాంతికి గురి చేసింది. కిరణ్ హీరోగా రాజుగారు రాణిగారు, ఎస్‌ఆర్ కళ్యాణమందం సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తన తదుపరి చిత్రం ‘సమ్మతమే’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇక సోదరుడి మృతితో అతని ఇంట్లో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.
Follow @TBO_Updates
Post a Comment