రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 మొత్తానికి తుది దశకు చేరుకుంటోంది. ఈ నెల 18న గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ మొదలు కానుంది. ఇక డిసెంబర్ 19వ తేదీ ఆదివారం ఫైనల్ విన్నర్ ను ఎనౌన్స్ చేయనున్నారు. అయితే ఈసారి ఫైనల్స్ కు రాబోయే అతిథి ఎవరు అనేది కూడా ఎంతో ఆసక్తిగా మారింది.
ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం బిగ్ బాస్ షోకు రామ్ చరణ్ అలియా భట్ తో కలిసి సందడి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వారు RRR సినిమాను ప్రమోట్ చేసే అవకాశం ఉంది. ఇక బాలీవుడ్ మూవీ 83 స్టార్స్ రణ్ వీర్ - దీపికా పదుకొనె కూడా బిగ్ బాస్ లో స్పెషక్ ఎట్రాక్షన్ గా నిలిచే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. కపిల్ దేవ్ బయోపిక్ 83 తెలుగులో కూడా భారీగానే రిలీజ్ కానుంది.
Follow @TBO_Updates
Post a Comment