భారీ అంచనాలతో తెరకెక్కిన RRR సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. ప్రస్తుతం దర్శకుడు రాజమౌళి దేశవ్యాప్తంగా ప్రమోషన్ డోస్ పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. శనివారం విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ కూడా అంచనాల స్థాయిని ఒక్కసారిగా పెంచేసింది.
అయితే అందులో పులికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ గాసిప్ వైరల్ గా మారింది. మొదటి షాట్ లో పులి కొమరం భీమ్ వెనకాల పడుతున్నట్లు అనిపిస్తోంది. అయితే ఆ తరువాత గ్లింప్స్ చివరలో అదే టైగర్ బ్రిటిష్ సైనికులపై దాడి చేస్తున్నట్లు అనిపిస్తోంది. దీంతో పులితో భీమ్ కు ఏమైనా బాండింగ్ ఏర్పడిందా అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. లేకపోతే టైగర్ ను వారిపైకి యూ టర్న్ తీసుకునేలా ప్లాన్ చేశాడా అనే అనుమానం కూడా వస్తోంది. ఇక ఈ విషయంలో క్లారిటీ రావాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @TBO_Updates
Post a Comment