RRR, శంకర్ యొక్క పాన్-ఇండియా చిత్రాలతో పాటు రామ్ చరణ్ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్‌పైకి వెళ్లనుంది. అలాగే ఈ మూవీ RRR, శంకర్ సినిమాల తరహాలోనే పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా విడుదల కానుంది.
కాగా చరణ్ - గౌతమ్ తిన్ననూరి సినిమా స్పోర్ట్స్ డ్రామాగా ఉండబోతోందని టాలీవుడ్ సర్కిల్స్ లో ఒక కొత్త టాక్ వినిపిస్తోంది. అయితే యాదృచ్ఛికంగా, చరణ్ గత సంవత్సరం ఒక ఇంటర్వ్యూలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ స్పోర్ట్స్ డ్రామా అని వెల్లడించాడు. ఇక మెగా హీరో ఎట్టకేలకు గౌతమ్ సినిమాతో తన కలను నెరవేర్చుకోబోతున్నట్లుగా కనిపిస్తోంది. అయితే కోలీవుడ్ దర్శకుడు ధరణి దర్శకత్వంలో చరణ్ స్పోర్ట్స్ డ్రామా చేయాలని పదేళ్ల క్రితం అనుకున్నాడు. కానీ అది ప్రారంభించిన వెంటనే ఆగిపోయింది. Follow @TBO_Updates
Post a Comment