దర్శక ధీరుడు రాజమౌళి తో సినిమా చేయాలని ప్రతి ఒక్క హీరో గా ఉంటుంది అయితే రాజమౌళికి కూడా స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలతో సినిమాలు చేయాలని ఎంతో ఆసక్తి ఉంటుంది. అయితే ఒకానొక సమయంలో దర్శకుడు రాజమౌళి పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని చాలా ప్రయత్నాలు చేశారట కెరీర్ మొదట్లో పవన్ కళ్యాణ్ తో కొన్నిసార్లు కథలపై చర్చలు కూడా జరిపాడు ఇటీవల ప్రమోషన్ లో పాల్గొన్న రాజమౌళి ఈ విషయంపై వివరణ ఇచ్చాడు.
కొన్ని చర్చల అనంతరం పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని అనుకున్నాను అని చెబుతూ.. కొన్నాళ్ళకు నేను నా కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి సినిమాలు చేయడం ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను. కేవలం మాస్-మసాలా ఎంటర్‌టైనర్ కంటే చాలా విభిన్నమైన ప్రాజెక్ట్ లను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అయితే ఆ సమయంలో పవన్ తన రాజకీయలతో బిజీ అయిపోయాడు. అందుకే మా దారులు వేరయ్యాయి.. అని రాజమౌళి వివరించారు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ తో రాజమౌళి సినిమా చేసే అవకాశం కుదరలేదని లేదని చాలా క్లియర్ గా వివరణ ఇచ్చినట్లు అర్థమవుతోంది.
Follow @TBO_Updates
Post a Comment