తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణం అందరినీ షాక్ కు గురి చేసింది.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సిరివెన్నెల మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. అయితే సిరివెన్నెల తో మొదలైన ఆయన రచనల ప్రయాణం శ్యామ్ సింగరాయ్ సినిమాతో ముగిశాయి.
సిరివెన్నెల సీతారామశాస్త్రి చివరగా హీరో నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలోని రెండు పాటలను వ్రాసారు. నాని అలాగే దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ప్రత్యేకంగా సీతారామ శాస్త్రి గారిని కలిసి పాటలు రాయాలని అడిగారు. ఇక సినిమా కంటెంట్ కు తగ్గట్టుగా సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ రెండు అద్భుతమైన పాటలను రాశారు. ఇక అదే ఆయనకు చివరి సినిమా అవుతుందని ఎవరూ ఊహించలేదు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎనిమిది వందల సినిమాలకు పనిచేసిన సిరివెన్నెల మూడు వేల పైగా పాటలను అందించారు.
Follow @TBO_Updates
Post a Comment