ఈ మధ్య కాలంలో చాలా మంది టాప్ సెలబ్రిటీలు విడాకుల తీసుకున్న విషయం తెలిసిందే. ఇక వారిలో చాలా మంది తమ ఇంటిపేరును వదులుకున్నారు. ఇక పలు హాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా జోనాస్ తన పేరు నుండి జోనాస్‌ను తొలగించడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఆమె అభిమానులు అయోమయంలో ఉన్నారు. ఎందుకంటే విడాకుల ప్రకటన కంటే ముందు సమంత కూడా ఇదే తరహాలో షాక్ ఇచ్చింది.
ప్రియాంక చోప్రా మరియు ఆమె భర్త నిక్ జోనాస్ మధ్య భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నట్లు టాక్ వస్తోంది. ఈ వార్త ఇప్పటికే సినీ ప్రపంచంలో వైరల్ గా మరినప్పటికి ఇద్దరిలో ఎవరు కూడా స్పందించలేదు. అయితే ప్రియాంక తల్లి మధు చోప్రా ఈ స్టార్ కపుల్ చాలా సంతోషంగా ఉన్నారని పుకార్లను కొట్టిపారేశారు. ప్రియాంక మరియు నిక్ ఇటీవల లాస్ ఏంజెల్స్‌లోని వారి మొదటి ఇంటికి మారారు మరియు వారు కలిసి దీపావళి జరుపుకున్నారని చెప్పారు.
Follow @TBO_Updates
Post a Comment