ఐసియాలో పోరాడుతూ కన్నుమూసిన సిరివెన్నెల!


సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే.  కిమ్స్ ఆసుపత్రి సోమవారం సాయంత్రం ఆరోగ్య అప్‌డేట్‌ను వెల్లడించింది. ఇక కొద్దిసేపటి క్రితమే సిరివెన్నెల మృతి చెందినట్లు తెలుస్తోంది. 66 ఏళ్ల గీత రచయిత నవంబర్ 24 నుంచి న్యుమోనియాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వైద్యులు తెలిపారు. మొన్నటివరకు సిరివెన్నెల కొంత ఆరోగ్యంగానే ఉన్నారు.

ఇటీవల పరిస్థితి కాస్త విషమించడంతో ఐసియులో చేర్పించారు. చికిత్స పొందుతు మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన మరణంతో ఇండస్ట్రీలోని ప్రముఖులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దాదాపు 3000లకు పైగా పాటలు రాసి 800కు పైగా చిత్రాలకు పని చేశారు. తెలుగు సాహిత్యానికి తగిన న్యాయం చేస్తూ అందంగా పాటలు రాసే అతికొద్ది మంది రచయితల్లో సిరివెన్నెల ఒకరు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post