నటి రకుల్ ప్రీత్ సింగ్ గత నెలలో నటుడు-నిర్మాత జాకీ భగ్నానితో ప్రేమలో ఉన్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. రకుల్ తన పుట్టినరోజున ప్రేమ విషయాన్ని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె అధికారికంగా చెప్పే వరకు, ఆమె జాకీతో డేటింగ్ చేస్తుందని ఎవరికీ తెలియదు. ఇక ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల రూమర్స్ వచ్చాయి. ఆ విషయంలో కూడా అమ్మడు ఒక క్లారిటీ ఇచ్చేసింది.
నేను నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాను, ఎందుకంటే ఇది అందంగా ఉందని నేను భావించాను. అందుకే ఆ విషయాన్ని షేర్ చేసుకోవాలని అనుకున్నట్లు.. రకుల్ ఇటీవలి హిందూస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.
ఒక సెలబ్రెటీ జీవితం ఎల్లప్పుడూ ఫోకస్ లో ఉంటుందని ఇక పబ్లిక్ లో మాట్లాడుకునే విషయాలు నన్ను ఇబ్బంది పెట్టే విదంగా ఉంటే నాకు నచ్చధని రకుల్ చెప్పింది. ఇక వివాహ ప్రణాళికల గురించి అడిగినప్పుడు.. అది జరిగినప్పుడు, తప్పకుండా మిగతా విషయాల మాదిరిగానే చెప్తాను.. ప్రస్తుతం, నేను నా కెరీర్‌పై దృష్టి పెడుతున్నాను. చేయాల్సిన ప్రాజెక్ట్ లు చాలా ఉన్నట్లు రకుల్ క్లారిటీ ఇచ్చినది.
Follow @TBO_Updates
Post a Comment