నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న అఖండ మాస్ ప్రేక్షకులలో అంచనాల స్థాయిని ఒక్కసారిగా పెయించేసింది. బోయపాటి మార్క్ మాస్ యాక్షన్ డ్రామాతో పాటు సెంటిమెంట్, ఎమోషన్‌తో కూడుకున్నదని ప్రచారం జరుగుతోంది. ఇందులో బాలకృష్ణ మార్క్ యాక్షన్, పవర్ ఫుల్ డైలాగ్స్ అతని అభిమానులకు అలాగే ఆ కమర్షియల్ ఆడియెన్స్ తప్పకుండ నచ్చుతాయట.
అయితే ఈ సినిమాతో బోయపాటి, బాలకృష్ణ ఓ సెన్సిటివ్ టాపిక్ ని టచ్ చేశారనే సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవాలయాలు మరియు విగ్రహాలపై ఇటీవల జరిగిన కొన్ని దాడుల నేపథ్యంలో కల్పిత అంశాలను జోడించి మొత్తం ఎపిసోడ్‌ను సినిమాలో చూపిస్తారట. సినిమా మొత్తం హైలైట్ సన్నివేశాలలో అది నిలుస్తుందని భావిస్తున్నారు. అఖండలో ఫిమెల్ సెంటిమెంట్ కూడా ఉందనే టాక్ వినిపిస్తోంది.
Follow @TBO_Updates
Post a Comment