విడాకుల అనంతరం సమంత తన సినీ జీవితాన్ని మరింత కొత్తగా మార్చుకుంటోంది. అలాగే బార్డర్ దాటి బాలీవుడ్ సినిమాలు చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తోంది. ఎలాంటి అడుగులు వేసినా కూడా సరికొత్తగా ఉండాలని ఆలోచిస్తోంది. అయితే పుష్ప సినిమాలో ఐటెమ్ సాంగ్ కోసం సమంతను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే.
అయితే ఆ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో స్పెషల్ సాంగ్ చేసేందుకు సమంత ఎంత రెమ్యునరేషన్ తీసుకుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా సమంత ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేందుకు 4 కోట్ల వరకు డిమాండ్ చేస్తోంది. ఇక ఐటెమ్ పాట కోసం ఆమె కోటి వరకు డిమాండ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు కొత్త కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు సమంత ఐటెమ్ సాంగ్స్ చేసింది లేదు. ఇక పుష్పలో ఆమె బన్నీతో ఎలాంటి స్టెప్పులు వేస్తుందో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment