బీహార్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు. వివరాల్లోకి వెళితే, మంగళవారం తెల్లవారుజామున బీహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో 333వ నెంబరు జాతీయ రహదారిపై నాలుగు చక్రాల వాహనం ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, దంపతులకు గాయాలయ్యాయి.
మృతుల్లో సుశాంత్ బావ, ఐపీఎస్ అధికారి ఓం ప్రకాశ్ సింగ్ నలుగురు బంధువులు ఉన్నారు. పాట్నాలో ఓం ప్రకాశ్ సింగ్ సోదరి గీతాదేవి అంత్యక్రియలు నిర్వహించి బాధితులంతా ఇంటికి తిరిగి వస్తున్నారు. మృతులను లాల్‌జిత్ సింగ్, నేమాని సింగ్, రామచంద్ర సింగ్, బేబీ సింగ్, అనితా సింగ్, ప్రీతమ్ సింగ్‌లుగా గుర్తించారు. గాయపడిన బల్ముకుంద్ సింగ్, దిల్ ఖుష్ సింగ్‌లను మెరుగైన చికిత్స కోసం పాట్నాకు తరలించారు.
Follow @TBO_Updates
Post a Comment