"రాధే శ్యామ్" యొక్క ప్రమోషన్లు ఇటీవల ప్రారంభమయ్యాయి ఇక మేకర్స్ త్వరలో రెండవ పాటను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభాస్ నటించిన ఈ రొమాంటిక్ డ్రామా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తుంది. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ కాపీని తన సన్నిహితులతో కలిసి ప్రభాస్ వీక్షించారట. ఇక ఫైనల్ అవుట్‌పుట్‌పై ఆయన సంతోషం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఇందులో ఒక 12 నిమిషాల ఎపిసోడ్ కథకు కీలకమైన అంశం అని తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద అదే ఎపిసోడ్ సినిమా భవితవ్యాన్ని నిర్ణయిస్తుందట. సముద్రంలో జరిగే 12 నిమిషాల ఎపిసోడ్ థ్రిల్లింగ్‌గా ఉంటుందట. ఇది మెయిన్ హైలైట్ అవుతుందని యూనిట్ సభ్యులకు ప్రభాస్ చెప్పినట్లు సమాచారం. ఇక “రాధే శ్యామ్” అభిమానులకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి. ప్రభాస్ నెక్స్ట్ యాక్షన్ జానర్‌లో ఉన్న “సలార్”లో కనిపించనున్నాడు.
Follow @TBO_Updates
Post a Comment