కథ:
ఆకాష్, భూమి ఇద్దరు కూడా కాలేజ్ మేట్స్. కళాశాల రోజుల్లో భూమి ఆకాష్‌తో తన ప్రేమను వ్యక్తం చేయలేకపోతుంది. చదువు పూర్తయిన తర్వాత వారు ఎవరి దారుల్లో వారు వెళ్లిపోతారు. హైదరాబాద్‌లో స్టార్టప్ కంపెనీని కొనసాగిస్తున్న భూమికి కొన్ని సంవత్సరాల తర్వాత ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా ఆకాష్ ప్రాజెక్ట్‌లో కలుస్తాడు. ఈసారి ఆకాష్ ఆమెను ఇష్టపడతాడు కానీ ప్రపోజ్ చేయడానికి వెనుకాడతాడు. ప్రతి ఒక్కరు తమ గత మరియు ప్రస్తుత ప్రేమ జీవితాన్ని ఎలా డీల్ చేస్తారు అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
‘వరుడు కావలెను’ సాధారణ కథతో ప్రారంభించి లైటర్ మోడ్‌లో సాగుతుంది. భూమి (రీతు వర్మ), వెన్నెల కిషోర్ మరియు ఇతరులు ఉద్యోగులుగా కార్పొరేట్ ఆఫీస్ సెటప్ లో కొంత ఎంటర్టైన్మెంట్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయు. ఆకాష్ (నాగ శౌర్య) హైదరాబాద్ వచ్చి భూమి కంపెనీకి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ చేపట్టడంతో రొమాన్స్ సీన్స్ మొదలవుతాయి. సినిమా ప్రారంభమైన 30 నిమిషాల్లోనే డైలాగ్‌లను ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయ. మహిళా ప్రేక్షకులు సీన్స్‌కి కనెక్ట్ అయ్యేలా చేయడంలో కొత్త దర్శకురాలు లక్ష్మీ సౌజన్య బాగా వర్కౌట్ చేసినట్లు తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్ అయితే పెద్దగా మలుపులు లేకుండా గడిచిపోయింది. చాలా వరకు సీన్స్ హడావుడి లేకుండా సింపుల్ గానే ఉన్నాయి.
సెకండ్ హాఫ్ కాలేజ్ ఫ్లాష్‌బ్యాక్ కథతో మొదలవుతుంది. కానీ ఆ సీన్స్ అంతగా ఆకట్టుకోవు. ఇక ఆ తరువాత 20 నిమిషాలు కొన్ని ఫ్యామిలీ సీన్స్ ఆలోచింపజేస్తాయి. తల్లిదండ్రులు తమ కుమార్తె జీవితం గురించి ఎలా ఆలోచించాలి అనే సీన్స్ లో మురళీ శర్మ నదియా ఎపిసోడ్ సినిమాలో బెస్ట్ అని చెప్పవచ్చు. చిత్రం యొక్క ఉత్తమ సన్నివేశం. ఆకాష్, భూమి ఇద్దరు తమ సహోద్యోగి వివాహం కోసం ఒక గ్రామానికి వెళ్లినప్పుడు కథ ఊపందుకుంటుంది. సప్తగిరి కామెడీ 15 నిమిషాల పాటు నవ్విస్తుంది. టిక్‌టాక్ ఫ్యాన్స్ అమ్మాయిలపై కామెడీ సీన్లు కాస్త వర్కవుట్ అయ్యాయి. క్లైమాక్స్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. కానీ ఫైనల్ గా సినిమా సింపుల్ గా ఉన్నప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోకపోవచ్చు.
పెర్ఫామెన్స్..
నాగశౌర్య లుక్స్, డ్రెస్ సెన్స్ పరంగా చాలా కొత్తగా కనిపించాడు. అతను సహజంగా ఆర్కిటెక్ట్‌గా క్లాసిగా దర్శనమిచ్చాడు. తన బాడీ లాంగ్వేజ్‌కి సరిపోయే పాత్రలను ఎంచుకునే రీతూ వర్మ మళ్లీ భూమి పాత్రలో ఆకట్టుకుంది. భూమి తల్లితండ్రులుగా నదియా, మురళీ శర్మ అద్భుతమైన పాత్రలు పోషించారు. వెన్నెల కిషోర్, ప్రవీణ్, సప్తగిరి హాస్య కామెడీతో సినిమాను కొంత బ్యాలెన్స్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ మంచి స్టాండర్డ్స్‌లో ఉన్నాయి. సినిమా కంటెంట్ కు తగ్గట్టుగా ఖర్చు చేసినందుకు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ని మెచ్చుకోవాలి. ఇక విశాల్ సి అందించిన సంగీతం పరవాలేదు. మూడు పాటలకు ఆన్ స్క్రీన్ పిక్చరైజేషన్ బాగుంది.
ప్లస్ పాయింట్స్
👉నాగ శౌర్య, రీతు కెమిస్ట్రీ
👉ఫ్యామిలీ సీన్స్
👉కొన్ని కామెడీ సీన్స్
నెగిటివ్ పాయింట్స్
👉రొటీన్ కథ
👉సెకండ్ హాఫ్ స్లోగా సాగడం
👉స్క్రీన్ ప్లే
ఫైనల్ గా:
‘వరుడు కావలెను’ ఫ్యామిలీ ఆడియన్స్‌కి, యువతకు ఒక యావరేజ్ సినిమా అని చెప్పవచ్చు. సెకండ్ హాఫ్ కొంత నీరసంగా స్టార్ట్ అయినప్పటికీ క్లైమాక్స్ లో సినిమా కొంత పాజిటివ్ గా అనిపించింది. ఇక సినిమాపై ఎలాంటి అంచనాలు లేకుండా చూడగలిగితే ఒకసారి చూడవచ్చు.
రేటింగ్: 2.75/5
Post a Comment