ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ త్వరలో తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఆహా కోసం టాక్ షోను నిర్వహించనున్నట్లు టాలీవుడ్‌లో ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఒక విధంగా ఇది చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ విషయంపై ఇంకా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
అయితే గౌతమిపుత్ర శాతకర్ణి - ఎన్టీఆర్ బయోపిక్ వంటి చిత్రాలలో బాలకృష్ణతో కలిసి పనిచేసిన సెన్సిబుల్ డైరెక్టర్ క్రిష్ ఈ టాక్ షోకు దర్శకత్వం వహించనున్నారు. క్రిష్ బాలకృష్ణతో మంచి అనుబంధం ఉన్నందున మరియు అతని స్టైల్, మ్యానరిజమ్స్ బాగా తెలిసినందున క్రిష్ ఈ ప్రాజెక్ట్‌ను బాగా నిర్వహించగలడని ఆహా బృందం భావించింది. క్రిష్, నందిని రెడ్డి, వంశీ పైడిపల్లి మరియు మారుతి వంటి దర్శకులు వివిధ ప్రాజెక్టుల కోసం ఆహాతో డీల్ సెట్ చేసుకున్నారు. ఆహా త్వరలో బాలయ్య టాక్ షో గురించి అధికారిక ప్రకటన చేయనున్నారు.
Follow @TBO_Updates
Post a Comment