టాలీవుడ్ ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మల్టిస్టారర్ త్రిబుల్ ఆర్ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నీ కూడా దాదాపు పూర్తయినట్లు సమాచారం. ఫైనల్ కట్ ఇటీవల రెడీ చేసిన దర్శకుడు రాజమౌళి రన్ టైమ్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
సినిమా మొత్తంగా 2:45 నిమిషాలు ఉంటుందట. ముఖ్యంగా చివరి లో అరగంట పాటు ఎమోషనల్ క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలుస్తుందని సమాచారం. ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు గా జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రల్లో నటించారు. అజయ్ దేవ్ గన్ మరొక ముఖ్యమైన పాత్రలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతున్నాడు. సంక్రాంతి పోటీలో నిలబడుతున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 900 కోట్లకు పైగా బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. మరి అన్ని భాషల్లో సినిమాకు ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment