మా ఎన్నికల్లో మంచు విష్ణు ఘన విజయం

 


మా ఎన్నికల్లో మొత్తానికి మంచు విష్ణు ఘనవిజయం సాధించారు.  గత కొన్ని రోజులుగా అధ్యక్ష పదవి కోసం ప్రచారాలు జోరుగా కొనసాగించిన ఇరు ప్యానెల్ సభ్యులు మొదటి నుంచి కూడా దూకుడుగానే కనిపించారు. ఏ మెత్రం వెనక్కి తగ్గకుండా విమర్శలు చేసుకుంటూ వచ్చారు. ఇక ఫైనల్ గా విష్ణు ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పై ఘన విజయం సాధించారు.

మా ఎన్నికలో ప్రకాష్ రాజ్ బ్యారర్ల నుండి శ్రీకాంత్, బెనర్జీ, ఉత్తేజ్ గెలిచారు. ఇక జనరల్ సెక్రటరీగా పోటీ చేసిన జీవిత రాజశేఖర్ ఓటమి చెందారు. మంచు విష్ణు ప్యానెల్ లో ఉన్నటువంటి రఘు బాబుతో పోటీ పడి జీవిత 9 ఓట్లతో ఓటమి చెందారు. మా ఎన్నికల చరిత్రలో ఈసారి కొత్త రికార్డు నమోదైంది. ఓటు హక్కు వినియోగించుకున్న 665 మంది, 83 శాతం పోలింగ్‌ నమోదయ్యింది. గత ఎన్నికల్లో కేవలం 474 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి.


Post a Comment

Previous Post Next Post