టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల కూతురు సితార ఘట్టమనేని త్వరలోనే వెండితెరకు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో దలపతి విజయ్ 66వ సినిమాలో సితార స్పెషల్ పాత్ర కోసం సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఆ సినిమాకు మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయనున్నాడు.
ఇక సినిమాలో విజయ్ గారాల కూతురి పాత్రలో మహేష్ బాబు కూతురు సితార ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్య సితార కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని అందరికి తెలిసిన విషయమే. అయితే ఇప్పటికే వారిద్దరూ ఒక యూ ట్యూబ్ ఛానెల్ ను కూడా కొనసాగిస్తున్నారు. ఇక వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ రసుకున్నపుడే సితారని విజను డాటర్ గా సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @TBO_Updates
Post a Comment