కథ:
అర్జున్ (శర్వానంద్), విజయ్ (సిద్ధార్థ్) ఇద్దరు కూడా సోదరుల తరహాలో పెరిగిన చిన్ననాటి స్నేహితులు. ఈ ఇద్దరు స్నేహితులు స్మగ్లింగ్ మాఫియా డాన్ ధనుంజయ్ (KGF రామ్) ను కలుస్తారు. ఇక ఆ తరువాత మహాని (అదితి రావు) ఇష్టపడే విజయ్, మాఫియాతో గొడవ కారణంగా వైజాగ్ నగరాన్ని విడిచి వెళ్ళవలసి వస్తుంది. విజయ్ వెళ్లిపోయిన తర్వాత, చిన్న తరహా స్మగ్లర్ చుంచు మామ (జగపతి బాబు) అర్జున్‌ను మరొక ప్రపంచంలోకి ప్రవేశించడానికి రప్పిస్తాడు. ఇక మహా, అర్జున్, విజయ్ ముగ్గురి జీవితాలు వారి బావోద్వేగమైన అనుభావలపై ఎలా ప్రభావితం చేస్తాయి అనేది సినిమాలోని అసలు పాయింట్. ఇక అను స్మితా(ఇమ్మాన్యూయేల్) వారి జీవితల్లోకి ఎలా వచ్చింది , గుని బాబ్జి (రావు రమేష్) వారి జీవితాలను ఏ విధంగా మలుపు తిప్పాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..
విశ్లేషణ:
మహా సముద్రం కథ కమర్షియల్ పరంగా చాలా బాగుంది. ఒక తెలియని భావోద్వేగాలతో కూడిన అంశాలు చాలానే ఉన్నాయి. ఇక సినిమాలో ఉన్న ఏడు ప్రధాన పాత్రలు హైలెట్ అవుతాయి. వాటిలో ఐదు క్యారెక్టర్లు మెయిన్ అని చెప్పవచ్చు. ఫస్ట్ హాఫ్ ముగింపులో సినిమా ఎంతగానో ఆలోచింపజేస్తుంది. ఒక విధంగా ఇంటర్వెల్ ఎపిసోడ్ సెకండ్ హాఫ్ పై మరింత పాజిటివ్ ఇంప్రెషన్‌తో ఉంచుతుంది. ఆర్ఎక్స్ -100 హిట్ చిత్రాన్ని అందించిన అజయ్ భూపతి మొదటి సగభాగంలో అద్భుతమైన ప్రతిభను కనబరిచాడు. డైలాగ్‌లు కూడా కథకు తగ్గట్లుగా ప్రభావవంతంగా ఉన్నాయి. అయితే సిద్ధార్థ్ తిరిగి వైజాగ్ వచ్చిన తర్వాత అతని పాత్రను అంతగా కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేయలేదు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్‌లో సినిమా గ్రాఫ్ తగ్గుతుంది
ముఖ్యంగా శర్వానంద్ మరియు సిద్ధార్థ్ ఇద్దరూ కూడా ఆకట్టుకునే నటనను ప్రదర్శించారు. అలాగే జగపతి బాబు, రావు రమేష్ పాత్రలు నెవర్ బిఫోర్ అనేలా ఉన్నాయి. ఇక అదితి రావు హైదరి గ్లామర్ తో కాకుండా నటనతో ప్రతిభను చూపించడానికి కొంత స్కోప్ వచ్చింది. ఆమె సినిమా కథకు తగ్గట్టుగా పాత్రకు న్యాయం చేసింది. ఇక అను ఇమ్మాన్యుయేల్ పాత్ర చాలా తక్కువే అయినా పరవాలేదు. చుంచు మామగా జగపతి బాబు పాత్ర ఓ వర్గం వారిని బాగానే ఆకట్టుకుంటుంది. అయితే చివరలో క్లయిమ్యాక్స్ లో కొంత జాగ్రత్తలు తీసుకొని ఉంటే బావుండేది. కథ ఫస్ట్ హాఫ్ కు సెకండ్ హాఫ్ కు అంతగా బ్యాలెన్స్ లేదని అనిపిస్తోంది. క్లయిమ్యాక్స్ లో కూడా ఇంకా బలంగా ముగింపు పలికి ఉంటే బావుండేది. ఇక KGF రామ్ ధనుంజయ్ పాత్ర సినిమాలో చాలా భీకరంగా హైలెట్ అయ్యింది. నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమా కోసం బడ్జెట్ విషయంలో బాగానే ధైర్యం చేసినట్లు అనిపిస్తోంది. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్ని టెక్నికల్ ఎలిమెంట్‌లకు భిన్నంగా ఉంటుంది. సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్. ముఖ్యంగా సముద్రాన్ని చూపించిన కొన్ని షాట్స్ చాలా బాగా వచ్చాయి.
ప్లస్ పాయింట్స్
👉ప్రధాన పాత్రలు, పెర్ఫామెన్స్
👉బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనెస్ పాయింట్స్
👉ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్
👉రొటీన్ ట్విస్టులు
👉సాంగ్స్
ఫైనల్ గా..
'మహా సముద్రం' సినిమాను దర్శకుడు ఎమోషనల్ కంటెంట్ తో ఆకట్టుకోవాలని బాగానే ప్రయత్నం చేశాడు. కానీ ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత హైలెట్ పాయింట్స్ సెకండ్ హాఫ్ లో క్లిక్కవ్వలేదు. ముఖ్యంగా సినిమా క్లయిమ్యాక్స్ అంతగా ఆకట్టుకోలేదు. దాని వల్లే సినిమా మొత్తం అంత గొప్పగా ఉండదు అనిపించే ఫీలింగ్ రావచ్చు. ఇక శర్వానంద్, జగపతి బాబు అద్భుతంగా నటించారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో పండుగ సీజన్ కొంత వరకు ఈ సినిమాకి హెల్ప్ అవ్వావచ్చు. ఇక కమర్షియల్ ఎమోషనల్ కంటెంట్ ను ఇష్టపడే వారికి 'మహా సముద్రం' నచ్చే అవకాశం ఉంటుంది.
Post a Comment