భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన కీయరా అద్వానీ ఆ తరువాత వినయ విధేయ రామతో డిజాస్టర్స్ అందుకుంది. ఒక సినిమా హిట్టవ్వగా మరొక మూవీ ప్లాప్ అయ్యింది. అయినప్పటికీ ఈ బ్యూటీకి తెలుగులో డిమాండ్ తగ్గలేదు. పైగా బాలీవుడ్ లో వరుసగా సక్సెస్ లు వస్తున్నాయి.
ఇక ప్రస్తుతం RC 15లో రామ్ చరణ్ కూడా జోడిగా నటిస్తున్న కీయరా మరొక ఆఫర్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్ 66వ సినిమా కోసం నిర్మాత దిల్ రాజు, వంశీ పైడిపల్లి ఈ బ్యూటీ సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నారట. ఇక సినిమాకి అమ్మడు దాదాపు 4కోట్ల వరకు డిమాండ్ చేసే అవకాశం ఉందట. ఒకవేళ ఆ సినిమా హిట్టయితే కోలీవుడ్ లో కూడా ఈ బ్యూటీకి మరిన్ని ఆఫర్స్ వస్తాయని చెప్పవచ్చు.
Follow @TBO_Updates
Post a Comment