అక్కినేని యువ హీరో అఖిల్ నలుగవ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ ఈ నెల 15న విడుదల కాబోతోంది. అయితే సినిమాపై ప్రస్తుతం అంచనాలు అయితే పెద్దగా లేవు. ఇక విడుదల తరువాత టాక్ పైనే సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంది. అయితే సినిమా విషయంలో ఇటీవల నాగార్జున కొన్ని అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఇటీవల నాగార్జున మరోసారి ఎడిట్ చేసిన వెర్షన్‌ను చూశాడట. టాక్ ఏమిటంటే దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కు మరికొంత ఎడిట్ అవసరం అని చెప్పారట. ఇప్పటికే నాగ్ చెప్పడం వల్ల కొన్ని సీన్స్ ను రీ షూట్ కూడా చేశారు. ముఖ్యంగా ఫారియా అబ్దుల్లా, ఈషా రెబ్బ పాత్రలను కూడా రీ షూట్ చేసిన సన్నివేశాల్లో హైలెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఎడిటింగ్ విషయంలో కూడా సందేహాలు వ్యక్తం చేయడంతో చిత్ర యూనిట్ ఆ పనితో బిజీ అవుతున్నట్లు తెలుస్తోంది.
Follow @TBO_Updates
Post a Comment