కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ కు గుండెపోటు రావడంతో విక్రమ్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అయితే ఆస్పత్రితో పాటు ప్రధాన మార్గాల్లో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే విక్రమ్ ఆసుపత్రికి కొంతమంది శాండిల్‌వుడ్ సినీ ప్రముఖులు చేరుకుంటున్నట్లు తెలుస్తోంది.
సినిమా థియేటర్లు మూసివేయాలని కర్ణాటక సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఇక వైద్యులు కొద్దిసేపటి క్రితం పునీత్ ఆరోగ్యంపై ఎలాంటి వివరణ ఇవ్వలేము అని క్లారిటీ ఇచ్చారు. మూడు గంటల తరువాత వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇక అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా పునీత్ రాజ్ కుమార్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. పునీత్ రాజ్ కుమార్ వయసు 46. అభిమానులు ఆయనను ముద్దుగా అప్పు అని పిలుచుకుంటారు. వారి తండ్రి రాజ్ కుమార్ కూడా కన్నడ హీరో.
Follow @TBO_Updates
Post a Comment