అక్కినేని ఫ్యామిలీలో మరో జంట విడిపోయింది. బెస్ట్ కపుల్స్ గా సౌత్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ అందుకున్న నాగ చైతన్య - సమంత ఇద్దరు విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా క్లారిటి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ విషయంపై నాగార్జున కూడా క్లారిటీ ఇచ్చారు.
'బరువెక్కిన హృదయంతో నేను ఈ విషయం చెప్తాను! సామ్ మరియు చై మధ్య జరిగినది చాలా దురదృష్టకరం. భార్య, భర్తల మధ్య జరిగేది వారి వ్యక్తిగతమైనది. సామ్ మరియు చాయ్ ఇద్దరూ కూడా నాకు ప్రియమైనవారు. ఇక నా కుటుంబం ఎల్లప్పుడూ సామ్‌తో గడిపిన క్షణాలను ఎంతో ఆదరిస్తుంది. అలాగే ఆమె ఎల్లప్పుడూ మాకు ప్రియమైనది. ఇద్దరికి గాడ్ బ్లేస్ యూ.. అని నాగార్జున వివరణ ఇచ్చారు.
Follow @TBO_Updates
Post a Comment