సమంత రూత్ ప్రభు కు ప్రస్తుతం ఇండస్ట్రీలో డిమాండ్ గట్టిగానే ఉంది. ఇప్పటికే రెండు సినిమాలకు సైన్ అప్ చేసిన సమంత త్వరలో OTT ప్లాట్‌ఫాం ఆహాతో ఒక ప్లాన్ కోసం చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఇంతకు ముందు, ఆహాలో 'సామ్ జామ్' పేరుతో ఒక ప్రముఖ టాక్ షోకు సమంత హోస్ట్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.
ఇక త్వరలోనే ఆహా కోసం ఒక వెబ్ సిరీస్‌ని తెరకెక్కించడానికి ఆమె సిద్ధంగా ఉందట. సమంత చివరిగా ప్రముఖ వెబ్ సిరీస్, ది ఫ్యామిలీ మ్యాన్ 2 లో తమిళ ఈలం మిలిటెంట్‌గా నటించింది. అందులో తన నటనా నైపుణ్యాలతో అలాగే యాక్షన్ సీక్వెన్స్‌లతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ వెబ్ సీరీస్ తో రానున్నట్లు సమాచారం.
సమంత శాంతరుబన్ దర్శకత్వంలో ఒక ప్రేమ కథ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దర్శక ద్వయం హరి మరియు హరీష్ తో కూడా మరో సినిమాకు సంతకం చేసింది. ఇప్పుడు, ఆహా వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సమంత తన కెరీర్ పై మళ్ళీ చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
Follow @TBO_Updates
Post a Comment