జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో ఇటీవల మా ఎన్నికలు నిర్వహించగా పోలింగ్ మధ్యలో కొన్ని గొడవలు జరిగిన విషయం తెలిసిందే. చాలామంది మంచు విష్ణు ప్రత్యర్ధులు దాడులు చేశారని తోసేశారని ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు ఆరోపణలు చేశారు. ఇక ప్రకాష్ రాజ్ ఇప్పటికే సీసీ ఫుటేజ్ ఇవ్వాలని డిమాండ్ చేయగా ఎన్నికల అధికారి తిరస్కరించారు.
ఇక పోలీసులు ఇరు సభ్యులను పిలిచి వీడియోలను చూపించగా ఈ విషయంపై ప్రకాష్ రాజ్ స్పందించారు. మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, తీర్చుకోవడానికి వచ్చాం అంటూ కౌంటింగ్ సమయంలో ఏం జరిగిందో అందరికీ తెలియాలి. ఎన్నికల అధికారి స్పందించనందుకే మేం పోలీసులను ఆశ్రయించామని అన్నారు. ఇక మా ఎన్నికల సీసీ ఫుటేజ్‌ను చూశాను అంటూ ఈసీ పెట్టిన 7 కెమెరాల విజువల్స్ కూడా చూడాలి అని అన్నారు. అంతే కాకుండా విష్ణూకి థాంక్స్ అంటూ.. ఫుటేజ్ చూడమన్నారు. వారం రోజుల్లో ఈ విషయంపై స్పందిస్తా. మా ఎన్నికల అధికారితోనే మాకు సమస్య. త్వరలో మా సభ్యుల రాజీనామాలు విష్ణుకు చేరుతాయి అని ప్రకాష్ రాజ్ తెలిపారు.
Follow @TBO_Updates
Post a Comment