టాలీవుడ్ ఇండస్ట్రీలో పి.ఆర్.ఓ గానే కాకుండా నిర్మాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న మహేష్ కోనేరు మృతి చెందాడు. సినిమా జర్నలిస్టు గా కొన్నేళ్ల పాటు పలు వెబ్ సైట్ లలో పని చేసిన మహేష్ ఆ తరువాత ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన పి.ఆర్.ఓ గా గుర్తింపు అందుకున్నాడు.
ఎక్కువగా నందమూరి హీరోల సినిమాలకు మహేష్ కోనేరు ప్రమోషన్ లో పి.ఆర్.ఓ గా అండగా ఉన్నాడు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కు ఒక సోదారుడిగా ఆయన ఇన్నేళ్ళు కీలక వ్యక్తిగా కొనసాగుతూ వచ్చాడు. ఇక ఈ ఉదయం విశాఖపట్నం లో గుండెపోటు తో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ కూడా ఈ ఘటనపై తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలుస్తోంది. మహేష్ కోనేరు మృతిపట్ల ప్రముఖ సెలబ్రెటీలు విచారం వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.
Follow @TBO_Updates
Post a Comment