హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా ప్రేమ విషయాన్ని బయట పెట్టేసింది. ఈ ప్రత్యేక సందర్భంలో, నటి ఇన్‌స్టాగ్రామ్‌లోకి అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత వాసు భగ్నాని కుమారుడు, బాలీవుడ్ యువ హీరో జాకీ భగ్నానితో ప్రేమలో ఉన్నట్లు రకుల్ ప్రకటించింది.
థాంక్యూ నా ప్రియతమా! మీరు ఈ సంవత్సరం ఒక అతిపెద్ద బహుమతి! నా జీవితానికి రంగులు జోడించినందుకు ధన్యవాదాలు, నన్ను నిరంతరం నవ్వించినందుకు ధన్యవాదాలు.. అంటూ ఒక స్పెషల్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇక రకుల్ ఇటీవల క్రిష్ యొక్క కొండపోలంలో హీరోయిన్ కనిపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమెకు బాలీవుడ్‌లో 5 ప్రాజెక్ట్‌లు, తమిళంలో 2 సినిమాలు ఉన్నాయి. పెళ్లిచూపులు హిందీ రీమేక్ మిత్రాన్‌లో జాకీ హీరోగా నటించాడు.
Follow @TBO_Updates
Post a Comment