Balayya to Host a Talk Show!


నందమూరి బాలకృష్ణ కూడా హోస్టింగ్ తో త్వరలోనే సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి నాగార్జున అనంతరం ఇప్పుడు బాలయ్య బాబు విబిన్నంగా తనదైన శైలిలో హోస్ట్ గా అలరించనున్నట్లు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒక టాక్ అయితే వైరల్ గా మారుతోంది. ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ఆహా యాప్ లోనే ఒక టాక్ షోకు బాలయ్య బాబు హోస్ట్ గా బాధ్యతలు చెపెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అఖండ సినిమాతో బిజీగా ఉన్న బాలయ్య ఆ తరువాత గోపిచంద్ మలినేనీతో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాడు. ఇక మధ్యలో ఒక టాక్ షో చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. ప్రముఖ సినీ తారలు ఆ షోలో పాల్గొని బాలయ్యతో వారి అనుభవాలను పంచుకొనున్నారట. ఇక త్వరలోనే ఈ విషయంలో అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అఖండ షూటింగ్ తుది దశలో ఉన్న విషయం తెలిసిందే.


Post a Comment

Previous Post Next Post