Another Hot Heroine in Salaar!


యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో సలార్ అనే హై ఓల్టేజ్ యాక్షన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతుండగా ప్రభాస్ మరోవైపు ఆదిపురుష్ ను కూడా కంటిన్యూ చేస్తున్నాడు. సలార్ షూటింగ్ ఈ ఏడాది చివరిలోపు పూర్తవుతుందని భావిస్తున్నారు. శ్రుతి హాసన్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక సినిమాలో మరో కీలకమైమ పాత్ర కోసం ఖిలాడీ ఫేమ్ మీనాక్షి చౌదరిని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.  ఆమె 2018 లో మిస్ ఇండియా పేజెంట్ హోల్డర్. ఆమె నెమ్మదిగా తెలుగు సినిమాలో బిజీగా మారుతోంది. తదుపరి సలార్ షెడ్యూల్ నుండి ఆమె సెట్స్‌లో చేరనుంది.  ఇక  సలార్ 2022 చివరిలో విడుదల కావచ్చు. లేదా 2023 ప్రారంభంలో విడుదల కావచ్చని సమాచారం.


Post a Comment

Previous Post Next Post