స్టార్ జంట నాగ చైతన్య, సమంత విడిపోయిన వార్త దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. పలువురు ప్రముఖులు కూడా విషయంపై స్పందించారు. ఇక చైతన్య, సమంత వారికి నచ్చిన జీవితాన్ని గడపాలని కోరుకున్నారు. ఇక వారు విడిపోయిన తర్వాత భరణం గురించి అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. 200 కోట్ల భరణం తీసుకోవడానికి సమంత నిరాకరించినట్లు పలు మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి.
అయితే అగ్ర నిర్మాత సురేష్ బాబు ఆధ్వర్యంలో పెళ్లికి ముందే పరస్పర ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ జంట విడిపోవాలని నిర్ణయించుకుంటే భవిష్యత్తులో భరణం గురించి ఎటువంటి చర్చ జరగకూడదని స్పష్టమైన ఒప్పందం జరిగిందట. ఈ ఆలోచన వెనుక నాగార్జున కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అగ్ర న్యాయవాది, చిత్రనిర్మాత నిరంజన్ రెడ్డి అన్ని చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసారు. చైతన్య మరియు సమంత ఇద్దరూ బాగా సంపాదిస్తున్నారు. వారు ఎప్పుడూ కూడా వారి తల్లిదండ్రులపై ఆధారపడలేదు. సమంత కూడా ఒక స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఆమె చైతన్య సంపాదనపై ఎప్పుడూ ఆధారపడలేదు. ఇక ప్రస్తుతం ఆమె భారణం నిరాకరణ విషయంలో వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది
Follow @TBO_Updates
Post a Comment